Sai Dharam Tej : వీరనారీలు, పోలీసులకు సాయిధరమ్ తేజ్ విరాళం…

-

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అయితే, సాయిధరమ్ తేజ్ నిన్న పుట్టినరోజును జరుపుకున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ మెగా హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియాలోనూ సాయిధరమ్ తేజ్ పేరు మార్మోగిపోతోంది.

కాగా, తన పుట్టినరోజున గొప్ప మనసును చాటుకున్నాడు సాయిధరమ్ తేజ్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు రూ. 10 లక్షలు, అలాగే ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ. 10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ నే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. నేను తీసుకునే గొప్ప నిర్ణయంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. అయితే అది మీ విరాళాల రూపంలో కాదు. సైనికులు, ఆర్మీ పోలీసులు మనకోసం చేస్తున్న పనికి మీరు చూపించే అభిమానం గౌరవం రూపంలో అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news