తెలంగాణ సంబురం బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా బతుకమ్మ సంబురాలను అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. ప్రతి రోజు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి.. సాయంత్రం పూట అందరూ ఓ చోట గుమిగూడి బతుకమ్మ ఆడుతున్నారు. అయితే బతుకమ్మ పండుగ వస్తుందనగానే.. కొన్ని మ్యూజిక్ సంస్థలు పాటలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఇప్పటికే బతుకమ్మ పాటలు బోలెడు వచ్చాయి. ఇక ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగింది. అందులో ఓ పాట మాత్రం ఆడపడుచులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానికి కారణం ఆ పాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాత్రం కూడా కలవడం.
నిజమండీ బాబు ఎమ్మెల్సీ కవిత ఈ ఏడాది రిలీజ్ అయిన ఓ బతుకమ్మ పాటలో తన గాత్రం వినిపించారు. భారత జాగృతి ఆధ్వర్యంలో.. 10 పాటలతో బతుకమ్మ ఆల్బమ్ విడుదల చేశారు. ఈ ఆల్బమ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ఒక్కొక్క ముత్యం నేనోముకుందూ.. గౌరీ గద్దె పీట నేనోముంకుందూ.. గంధపక్షంతలు నేనోముకుందూ.. అంటూ కవిత తన గాత్రం అందించారు. ఈ పాటను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మరి ఆ పాటేంటో ఓసారి మీరూ వినేయండి.
మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం –
మన తెలంగాణ ఆత్మగౌరవ సంబరం… బతుకమ్మ 🙏బతుకమ్మ శుభాకాంక్షలతో
ఈ ఏడాది బతుకమ్మ పాటలు మీ కోసంhttps://t.co/LSUBFMFhchSingers:
Telu Vijaya, Padmavathi, Soumya , Sindhu and Kalvakuntla KavithaMusic: Akhil,
Dop & Editing: Ajay kodam
Lyrics &… pic.twitter.com/dOts1yIdip— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023