BAD NEWS: నెథర్లాండ్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు వర్షం అడ్డంకి !

-

ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో నెదర్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్యన పోటీ ఉంటుందా ? లేదా ఏకపక్షముగా మ్యాచ్ జరుగనుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో కివీస్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఆరు పాయింట్ లతో రన్ రేట్ ను మెరుగుపరుచుకుంటే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక నెదర్లాండ్ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉందని చెప్పాలి.. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాల్గొన్న జట్లలో విజయం ఎరుగని రెండవ జట్టుగా ఉండిపోయింది. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి వరల్డ్ కప్ లో శుభారంభాన్ని ఇవ్వాలని కసితో రగిలిపోతోంది. కానీ అనుభవలేమి, క్రీజులో ఎక్కువ సేపు పాతుకుపోయి పట్టుదల, మిడిల్ ఓవర్ లలో వికెట్లు తీయలేక చతికిలపడుతోంది. ఈ మ్యాచ్ లో అయినా ఆశించిన విధంగా రాణించి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.

కానీ ప్రస్తుతానికి మ్యాచ్ సమయం అయినా ఇంకా టాస్ పడకపోవడంతో అభిమానులు అంతా ఏంటో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వర్షం పడుతుండడంతో కవర్స్ ఇంకా పిచ్ మీదనే ఉన్నాయి. మరి ఎప్పుడు మ్యాచ్ మొదలు కానుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news