తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… బీసీ ఎజెండాతో ముందుకెళ్లాలని బిజెపి భావిస్తోంది. తాము గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్న నినాదంతో ఎన్నికల్లో తలపడనుంది. అవసరమైతే ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే దిశగా కసరత్తు చేస్తుండగా… టికెట్ల కేటాయింపులోను బీసీలకు ప్రాధాన్యమిచ్చేలా యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే బీసీ గర్జన ఏర్పాటు చేసి…. మోదీ లేదా అమిత్ షాతో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం మేరకు తెలంగాణ బిజెపి సీఎం అభ్యర్థిగా బండి సంజయ్ ఉండే ఛాన్స్ ఉంది. కాగా, గురువారం రాత్రి నడ్డా నివాసంలో మరోసారి కోర్ కమిటీ సమావేశంకాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తది జాబితాను సిద్ధం చేసి.. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అభ్యర్థులను ప్రకటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి 65మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం.