తెలుగు డ్యాన్సర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్

-

టాలీవుడ్​లో ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ అనగానే గుర్తొచ్చే మొదటి రెండు పేర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. ఇందులో జానీ మాస్టర్ స్టైలే వేరు. ఈయన కొరియోగ్రఫీ.. యాటిట్యూడ్​కు చాలా మంది ఫిదా అవుతుంటారు. ఇక కేవలం కొరియోగ్రఫీనే కాదు.. సినిమాల్లో నటించడం.. బుల్లితెరపై జడ్జీగా కనిపించడం కూడా చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్​లో ఈయన హాప్పెనింగ్ కొరియోగ్రాఫర్.

అయితే తాజాగా జానీ మాస్టర్ తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్​ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్ జేఆర్ఎస్​సీ కన్వెన్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్​ను స్థాపించిన సీనియర్ నటుడు, డ్యాన్సర్ ముక్కురాజును గుర్తు చేసుకుంటూ.. ఆయన కృషి వల్లే తామంతా చిత్ర పరిశ్రమలో ఒక అసోసియేషన్​గా ఏర్పడి ఉన్నత స్థానంలో ఉన్నామని అన్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయనున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news