ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.
అయితే.. ‘మంగళవారం’ సినిమా కథ చెప్పేందుకు అజయ్ భూపతి వచ్చేసరికి తాను కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని నటి పాయల్ రాజ్ పుత్ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మంగళవారం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు చెప్పినప్పటికీ కథ బాగా నచ్చడంతో సినిమా పూర్తయ్యేవరకు సర్జరీ వద్దనుకున్నానని వెల్లడించారు. ఈ సినిమాను వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.