BREAKING : బీజేపీ పార్టీ తొలి జాబితా విడుదలకు బ్రేక్‌ !

-

BREAKING : తెలంగాణ బీజేపీ పార్టీ తొలి జాబితా విడుదలకు బ్రేక్‌ పడింది. నిన్నటి నుంచి తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడిపోయింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల పై చర్చ నిర్వహించారు బీజేపీ అగ్రనేతలు.

ఈ సందర్భంగా సుమారు 55 స్థానాల కు అభ్యర్థులను ఫైనల్ చేశారు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు. అయితే… తెలంగాణ రాష్ట్ర కొర్ కమిటీ నేతల్లో ఏకాభిప్రాయం లేని స్థానాలను పక్కన బెట్టింది ఎన్నికల కమిటీ. ఖరారు అయిన వారికి ఫోన్ చేశారు కిషన్ రెడ్డి మరియు ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్. ఇందులో ఒకరిద్దరు అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల విషయంలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం అందుతోంది. దీంతో జాబితా విడుదలను నిలిపేసిన బిజెపి పార్టీ. అభ్యంతరం ఉన్న స్థానాలను ప్రకటించకుండా మిగతా స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news