నేటితో ముగియనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

-

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. 8వ రోజు ఆదివారం స్వర్ణ రథంపై శ్రీవారు విహరించారు. అదేరోజు రాత్రి ఆశ్వ వాహనంపై శ్రీవారు ఊరేగారు. ఇవాళ చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తులు బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివస్తున్నారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్ర స్నానాన్ని ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. తెల్లవారుజామునే పల్లకీ-తురుచ్చీ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇవాళ దసరా పండుగ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు హాజరు అవుతున్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 10 నుంచి 12 సమయం వరకు పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news