వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ఇండియా వరుస విజయాలతో టైటిల్ లక్ష్యంగా పెట్టుకుని యుద్ధం చేస్తోంది. అయిదు మ్యాచ్ లు గెలుచుకున్న ఇండియాకు సెమీస్ కు వెళ్లడం కష్టమేమీ కాదు. ఇప్పటి వరకు ఇండియా ఆడిన మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లను ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇండియా ఆడనున్న తర్వాత మ్యాచ్ లలో వరుసగా ఇంగ్లాండ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మరియు నెదర్లాండ్ లను ఎదుకోనుంది, ఈ నాలుగు టీం లలో ఎవరు ఇండియా విజయాల పరంపరకు బ్రేక్ వేయనున్నారు. అసలు ఆ సత్తా ఉన్న జట్టు ఉందా అంటూ అభిమానులు సవాలు చేస్తున్నారు. క్రికెట్ ప్రముఖులు చెబుతున్న ప్రకారం ఇంగ్లాండ్ లేదా సౌత్ ఆఫ్రికా లలో ఒకరు ఇండియాను ఓడించకపోయినా గట్టి పోటీ ఇస్తాయని అభిప్రాయపడుతున్నారు.
మరి ఇందులో ఎంతవరకు సాధ్యం అవుతుందో మ్యాచ్ లు జరిగే వరకు వెయిట్ చేయాల్సి ఉంది.