ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆశించిన విధంగా రాణించడంతో ఫెయిల్ అవుతోంది. ఆరంభంలో జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓడిపోవడమే తన ఫెయిల్యూర్ ను సూచించింది అని చెప్పాలి. అంతకు ముందు స్వదేశంలో కివీస్ తో జరిగిన సిరీస్ లో బాగానే ఆడిన ఇంగ్లాండ్ ఎందుకో వరుసగా విఫలం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు ఓడిపోయి సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన అయిదు మ్యాచ్ లలో అయిదు గెలవడమే కాకుండా మంచి రన్ రేట్ ను కనుక సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ సెమీస్ చేరే ఛాన్సెస్ ఉన్నాయి.
కానీ ఏ విధంగా ఆడుతుంది అన్న విషయం పైనే అవకాశాలు ఆదారపడి ఉన్నాయి. ఇంకా ఈ టోర్నమెంట్ లో రూట్, మలన్ మినహా బ్యాటింగ్ లో రాణించిన ప్లేయర్ లేడు. ఇక బౌలింగ్ లోనూ నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది.