ఈసీ జాతీయ ఐకాన్‌గా బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్‌రావ్‌

-

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు గురించి తెలియని వారుండరు. వర్సటైల్ సినిమాలు చేస్తూ.. తన నటనతో ప్రేక్షకులను అలరించే రాజ్​కుమార్ తాజాగా ఈసీ జాతీయ ఐకాన్​గా నియమితులయ్యారు. హిందీ మూవీ ‘న్యూటన్‌’లో ఎన్నికల అధికారి పాత్ర పోషించారు రాజ్​కుమార్. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్రతో అదరగొట్టాడు.

ఈ పాత్రలో తన నటనకుప్రశంసలు అందుకున్న రాజ్‌కుమార్‌ రావ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) జాతీయ ఐకాన్‌గా నియమించింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు పొందిన ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్‌ అవార్డుల ఎంపికకు అధికారిక నామినేషను కూడా పొందిన విషయం తెలిసిందే. ఓటర్లలో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను జాతీయ ఈసీ ఐకాన్‌లుగా నియమిస్తుందన్న విషయం తెలిసిందే. గతంలో ప్రముఖ నటులు పంకజ్‌ త్రిపాఠి, అమీర్‌ఖాన్‌, క్రీడాకారులు సచిన్‌ తెందుల్కర్‌, ఎం.ఎస్‌.ధోని, మేరీకోమ్‌ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్‌లుగా వ్యవహరించగా.. తాజాగా రాజ్‌కుమార్‌ నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news