ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ గూటికి రాజ్‌గోపాల్‌ రెడ్డి: హరీశ్‌రావు

-

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లనున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్​కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉందని.. బీజేపీ ఈ రేసులో లేదంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు స్పందించి.. ఆయన వ్యాఖ్యలు ఖండించారు.

ఇక తాజాగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఒప్పందంలో భాగంగానే హస్తం గూటికి వెళ్తున్నారని అన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని ఆరోపించారు. గత మూడు ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతిచ్చిన రుణాన్ని బీజేపీ తీర్చుకుంటోందని విమర్శించారు. రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు ఇచ్చి.. కర్షక వ్యతిరేక పార్టీగా మారిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అభివృద్ధి 60ఏళ్లు వెనక్కి పోతుందని హరీశ్‌రావు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news