కొందరూ దుర్మార్గులు ఎన్నికల్లో గెలవడానికి షార్ట్ కట్ పద్దతిని ఎంచుకుంటున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వర్థన్నపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు మనల్నీ ఏడ్పించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రైతు బంధు వృధా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. దళితబంధు, రైతుబంధు పదాలను కేసీఆర్ పుట్టించాడు. గతంలో మింగుడు బంధు మాత్రమే ఉండేది. తెలంగాణ వచ్చిన తరువాత ఐనవోలు, అనపర్తి మండలాలకు నీళ్లు ఇచ్చాం.
రింగురోడ్డులో భూములు తీసుకుంటారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను చెబుతున్నాను.. ఎవ్వరూ భూములు కోల్పోరు అని హామీ ఇస్తున్నానని తెలిపారు సీఎం కేసీఆర్. రైతు బీమా తరహాలో ప్రజలందరికీ బీమా కల్పిస్తామని హామి ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ధరణీని తీసేసి బంగాళఖాతంలో వేస్తామంటున్నారు. ధరణి పోర్టల్ ను తీసేస్తే మీకు రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు.