పూటపూటకో పార్టీ మారేవారికి అవకాశం ఇస్తే ప్రజలు ఓడిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్ మాట్లాడారు. అనేక రకాలుగా పార్టీలు మారుతారు. వాళ్ల పదవుల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారి మాటకూడా మార్చేవారు మనమధ్యనే ఉన్నారు. ఏ పార్టీ, ఏ గవర్నమెంట్ ఏం చేసింది.. ప్రజల కోసం ఆలోచించింది.. మళ్లీ మేనిఫెస్టో.. వాగ్ధానం ప్రజల ముందుపెట్టింది ఆలోచించి ఓటు వేయాలి. ఇది చైతన్యం ఉన్న ప్రాంతం. కమ్యూనిస్టులు చాలాకాలం ఎమ్మెల్యేలుగా ఉన్న పని చేసిన ప్రాంతం.
ఉద్యమాలు జరిగిన ప్రాంతం. నీతి, నిజాయితీతో, చిత్తశుద్ధితో, ప్రజల కోసం.. ప్రజల బాగు కోసం.. కులం, మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పని చేశారో వారిని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తరు తప్పా.. డబ్బు కట్టల అహంకారంతో వచ్చేవాళ్లకు, పిచ్చి రాజకీయాలతో వచ్చేవాళ్లకో.. మాటలు మార్చేవారికో.. పూటపూటకో పార్టీలు మారేవారికి అవకాశం ఇస్తే.. వాళ్లు గెలస్తురు తప్పా ప్రజలు ఓడిపోతారు’ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవీ ఇచ్చాను. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ మోసం చేసింది అంటున్నాడు.. ఆయనను బీఆర్ఎస్ మోసం చేసిందో.. బీఆర్ఎస్ ను ఆయన మోసం చేశాడో మీరే చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.