చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెప్తున్నారని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో మలాకత్ ముగించుకుని బయటికి వచ్చారు కుటుంబ సభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, మరియు కాసాని జ్ఞానేశ్వర్. ఈ సందర్భంగా జైలు బయట మీడియాతో నారా లోకేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదన్నారు. టిడిపి అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక పైసా కూడా అవినీతి చేయలేదని వెల్ల డించారు.
చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు. వైసిపి నేతల ఈ విషయం చెబుతున్నారు…చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెప్తున్నారని ఆగ్రహించారు. నా తల్లి భువనేశ్వరీ పై కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును జైల్లో పెట్టి 50 రోజులు గడిచిన ఒక్క ఆధారం కూడా బయటపెట్ల లేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్నారు లోకేష్.