నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్ళు కనిపించడం లేదని బెయిల్ వచ్చిందంటూ సెటైర్లు పేల్చారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్ అంటూ సెటైర్ వేశారు అంబటి రాంబాబు. జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది…పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో అంటూ టీటీడీపీపై సెటైర్లు వేశారు.
తెలంగాణాలో చేతులెత్తేసిన తెలుగుదేశం! త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. కాగా… ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. నాలుగు వారాల పాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24న సరండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామన్న కోర్టు… ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని షరతులు పెట్టింది.