రానున్న ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని PKకు తెలుసని… అప్పు చేసి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారనడం పచ్చి బూతని అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఎత్తేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అన్నది లేకుండా అప్పు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… అభివృద్ధి ద్వారా సంపాదన సృష్టించి అందులో నుంచి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఖర్చు చేయాలన్నారు. సంక్షేమం అనేది కంపల్సరీ అని, కానీ అభివృద్ధి లేని సంక్షేమం సంక్షోభానికి దారి తీస్తుందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది అదేనని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉన్నదని, ఇటువంటి ఆర్థిక వ్యవస్థను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ గారు పేర్కొనగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏది చేసినా అప్పే, అప్పు తప్ప ఇంకేమీ లేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రాష్ట్ర మహిళల నుంచి సగటున లక్షా 80వేల రూపాయలను జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుంజుకున్నదని, ఈ విషయాన్ని లెక్కలతో సహా వివరించానని తెలిపారు.