తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం పట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలేవి జరగకుండా నిఘా పెడుతున్నారు. కోడ్ ఉల్లంఘటన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల కోడ్ ప్రభావం రేసింగ్‌పై పడింది ఇప్పుడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర తీరాన నిర్వహించనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ పై ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండడం తో రేసింగ్ నిర్వహించడం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ వేదికను చెన్నై కి తరలించినట్లు వెల్లడించారు. రేస్ కోసం నిన్నటి వరకూ నిర్వాహకులు శరవేగంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో రద్దైన ఈ లీగ్ ను నవంబర్ 4, 5 తేదీల్లో నే చెన్నై లోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లవ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆన్ లైన్లో టికెట్లు అమ్మకం జరగగా డబ్బులు తిరిగి ఇస్తామని ఈ వివరాలు వారి వారి వ్యక్తిగత మెయిల్ ఐడీలకు పంపుతామని తెలిపారు.