రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరనున్న వివేక్

-

Vivek Venkata swamy : బీజేపీకి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి రాజీనామా చేశారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్‌.. బీజేపీకి వెంకటస్వామి రాజీనామా చేశారు. కాసేపట్లో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు వివేక్. ఇవాళ, రేపు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగనుంది.

Vivek will join the Congress in the presence of Rahul Gandhi

అయితే.. ఇప్పుడు హైదరాబాద్ లోని నోవా హోటల్‌ లో రాహుల్‌ గాంధీ ఉన్నారు. మరికాసేపట్లోనే.. రాహుల్‌ గాంధీని కలిసి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు వివేక్. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ కి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట. కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకోవడంతో…చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అయిందని సమాచారం. వాస్తవానికి చెన్నూర్ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. వివేక్ వెంకటస్వామి కోసం చెన్నూర్ స్థానాన్ని సిపిఐ కు ఇవ్వరాదని తాజాగా నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్‌.

Read more RELATED
Recommended to you

Latest news