‘ఎవరో ఆట పట్టించారనుకుంటా’.. హ్యాకింగ్ వివాదంపై పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్

-

యాపిల్ ఫోన్ల హ్యాకింగ్ వివాదం దేశవ్యాప్తంగా పెను వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరింత వివాదాస్పదం అయ్యాయి. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చంటూ పీయూష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

‘విపక్ష నేతలపై ప్రాంక్ చేసినట్టున్నారని.. దానిపై వారు ఫిర్యాదు చేస్తే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. మరోవైపు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రస్తుతం దేశంలో విపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయని అన్నారు. అందుకే ఆ పార్టీలు ప్రతి విషయంలో అనుమానాలు, కుట్ర కోణలు అంటూ భయపడుతున్నారని అన్నారు. విపక్షాలు అంతర్గత పోరులో చిక్కుకుపోయి బిజీగా ఉన్నారని విమర్శించారు. అసలు ఈ హ్యాకింగ్ ఏదైనా లోపం వల్ల జరిగి ఉండొచ్చని.. 150 దేశాల్లో ఇలా జరిగిందని యాపిల్ సంస్థే వెల్లడించిందని తెలిపారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్ తప్పక విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news