నేటితో సంపూర్ణం కానున్న కేసీఆర్ ‘రాజశ్యామల యాగం’

-

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర’ యాగం శాస్త్రోక్తంగా జరుగుతోంది. పండితులు పఠిస్తున్న వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. ఈ యాగం నేటితో సంపూర్ణం కానుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ రెండు రోజుల క్రితం యాగాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, ఇతరులు క్రతువుల్లో పాల్గొంటారు. పూర్ణాహుతితో రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం సంపూర్ణం అవుతుంది. యాగంలో మూడు లక్షలకు పైగా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలను హవనం చేస్తున్నారు. యాగంలో తెలంగాణతో పాటు తమిళనాడు, ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది ఉద్ధండులైన పండితులు పాల్గొంటున్నారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ యజుర్వేద పండితులు ఘనస్వస్తి పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news