టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్

-

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ అప్గనిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ మధ్య 34వ మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆప్గానిస్తాన్ 6 స్థానంలో ఉండగా.. నెదర్లాండ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆప్గనిస్తాన్ ఆరు మ్యాచ్ లు ఆడి 3 విజయం సాధించగా.. నెదర్లాండ్ 6 మ్యాచ్ ల్లో రెండింటిలో గెలుపొందింది. వీరిరువురిలో అప్గానిస్తాన్ కి సెమీస్ అవకాశాలు ఉండటంతో ఈ మ్యాచ్ ఆప్గనిస్తాన్ కి చాలా కీలకం కానుంది. నెదర్లాండ్ జట్టు రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టును మట్టిలో కరిపించిన విసయం తెలిసిందే.

నెదర్లాండ్ జట్టు :
మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, కోలిన్, అకెర్ మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడ్, సిబ్రాండ్, ఎంగెల్ బ్రెచ్డ్, సకిబ్ జుల్ఫికర్, లోగాన్, వాన్ బీక్, రోల్ప్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్ , పాల్ వాన్ మీకెరెన్.

ఆప్గనిస్తాన్ జట్టు :
రహ్మనుల్లా గుర్భాజ్ (వికెట్ కీపర్ ), ఇబ్రీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్షాయ్, ఇక్రమ్ అలీఖిత్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హాక్ ఫరూఖీ.

Read more RELATED
Recommended to you

Latest news