సయ్యద్ ముస్తాక్ అలీ తుది పోరుకు పంజాబ్, బరోడా జట్లు !

-

గత మూడు వారాలుగా హోరాహోరీగా జరుగుతున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది పోరుకు చేరుకుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లలో పంజాబ్ ఢిల్లీ ని మరియు బరోడా అస్సాం లను చిత్తు చేసి ఫైనల్ కు అర్హత సాధించాయి. రెండు జట్లు కూడా ఛేజింగ్ లో సత్తా చూపించి ఫైనల్ కు చేరాయి. ఈ విజయాలలో పంజాబ్ లో అభిషేక్ శర్మ (77) మరియు కెప్టెన్ మన్దీప్ సింగ్ (63) తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా విజయం చేరువయింది. ఇక బరోడా జట్టులో ఓపెనర్లు రాణించడంతో విజయం తేలికయింది. కాగా ఈ రెండు జట్ల మధ్యన ఫైనల్ మ్యాచ్ సోమవారం రోజున సాయంత్రం 4.30 గంటలకు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం లో జరగనుంది.

ఈ మ్యాచ్ లో ఫేవరెట్ మాత్రం పంజాబ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ తమది కాని రోజున ఎంతటి జట్టు అయినా ఓడిపోవాల్సిందే. ఇక పంజాబ్ జట్టు ఫైనల్ కు చేరడంలో సీజన్ మొత్తం రాణించి కీలక పాత్ర పోషించాడు అభిషేక్ శర్మ. మరి ఫైనల్ లోనూ చెలరేగి ఆడి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ని అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news