“అపరకుబేరుడి” భార్యకు దీపావళి గిఫ్ట్ గా రూ. 10 కోట్ల కారు !

-

ఇండియాలోనే అపరకుబేరుడిగా ఆస్తులను సంపాదించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అప్పుడప్పుడు తన వారికి ఇచ్చే గిఫ్ట్ లతో చాలా వైరల్ అవుతూ ఉంటాడు. అంతకు ముందు ఒకసారి తన కంపెనీ లో పనిచేసిన ఒక ఉద్యోగికి 15 అంతస్థుల భవనాన్ని ఉచితంగా గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ముఖేష్ అంబానీ తన శ్రీమతి నేత అంబానీకి చాలా విలువైన మరియు ఖరీదైన గిఫ్ట్ ను అందించారు. దీపావళి ఈ వారంలో రానుండగా పండుగ కన్నా ముందే ముఖేష్ అంబానీ తన సతీమణి మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా దేశంలోనే చాలా ఖరీదు అయిన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ SUV కార్ ను బహుమతిగా అందించారు.

ఇక ఈ కారు యొక్క విలువను చూస్తే సుమారుగా.. రూ. 10 కోట్లుగా ఉంటుందని ప్రముఖ ఆటో మొబైల్ వెబ్ సైట్ CARTOQ తెలిపింది. ఇక ఈ కారు ఇండియాలోనే ఖరీదైన గిఫ్ట్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విధమైన కారు మన దేశంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news