ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఎవ్వరూ ఆపలేరు: కేంద్రమంత్రి

-

తెలంగాణ ఎన్నికల సమయం కావడంతో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరపున ప్రచారసభను నిర్వహించి ఎల్బీ స్టేడియం లో అధికార పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మీటింగ్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ కేంద్రమండ్త్రి అశ్విని కుమార్ చౌబే ఒక కీలక విషయం పట్ల కాసేపటి క్రితమే కామెంట్ చేశారు. ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కాం దేశం అంతటా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ స్కాం లో తెలంగాణ ఎమ్మెల్సీ మరియు సీఎం కేసీఆర్ కూతురు కవిత కు ప్రమేయం ఉందని ఈడీ నోటీసులను సైతం అందచేసింది. దీనిపై కేంద్రమంత్రి మాట్లాడారు… ఈ రోజు లేదా రేపు ఈ స్కాం లో ఉన్న కవితను జైలుకు పంపడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తో కలిసి మద్యం స్కాం లో పాత్రులైన కేసీఆర్ అండ్ కవిత ఇందులో శిక్ష అనుభవించక తప్పదు అంటూ మాట్లాడారు చౌబే. ప్రజలను నిలువునా కేసీఆర్ మరియు కేజ్రీవాల్ లు దోచుకు తింటున్నారు అంటూ కేంద్రమంత్రి చౌబే మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news