Malla reddy : నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ లో నేతల వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి తన చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని, కారు లేదని పొందుపరిచారు. రూ. 95 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
అటు మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క తనకు అప్పులు లేవని తెలిపారు. కోరుట్ల బీజేపీ అభ్యర్థి అరవింద్ రూ. 107.43 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు. ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులున్న అభ్యర్థి గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలిచారు.
ఆయన తన కుటుంబానికి రూ. 433.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫీడవిట్ లో ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి నిలిచారు. తన కుటుంబం పేరిట రూ. 227.51 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. తనకు రూ. 112.75 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.