నేడు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ

-

Chandrababu Fiber Net case : నేడు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కోర్ట్ నెంబర్ 6 లో 11వ నెంబర్ గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది.

Chandrababu Fiber Net case hearing in Supreme Court today

ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసరం విచారించనుంది. మరోవైపు స్కిల్ కేసులో 17Aపై తీర్పు పెండింగ్ లో ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన జడ్జిమెంట్ వెలువడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు చంద్రబాబు ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ కి వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యల కారణంగా మూడు వారాల పాటు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news