ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను తెలుగు, ఆంగ్ల భాషల్లో పార్టీలు సమర్పించాలని…ప్రవర్తనా నియమావళికి లోబడే పథకాలున్నట్లు ధృవీకరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శాసనసభ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ, అధికారులు సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఈసీ మార్గదర్శకాలను వివరించారు. నామినేషన్ల పరిశీలనలో నలుగురికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రపార్టీలు 40 మంది స్టార్ క్యాంపెనర్ల జాబితాను నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి వారంలోపు ఇవ్వాలని తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 10వేల 760 అనుమతులిచ్చినట్లు అధికారులు వివరించారు.
పార్టీలు, అభ్యర్థులిచ్చే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతితప్పనిసరని తెలిపారు. ఈ జనవరి1 నుంచి 43 లక్షల 21 వేల ఓటరు దరఖాస్తులు పరిష్కరించినట్లు వికారాస్ చెప్పారు. 45లక్షల 60 వేల ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించి…. 33 లక్షల 43 వేలకార్డులు పంపిణీచేసినట్లు తెలిపారు. 10తేదీ తర్వాత ఓటర్ స్లిప్పులు పంపిణీచేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి సీవిజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 3వేల 205 ఫిర్యాదులురాగా 1961 సరైనవిగా గుర్తించి చర్యలు చేపట్టినట్లు సీఈవో వికాస్‌రాజ్ వివరించారు. ఈసీ మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా ప్రక్రియ జరిగేలా రిటర్నింగ్ అధికారులకు సహకరించాలని సీఈఓ వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు