హీరోయిన్ రష్మిక మందాన మార్ఫింగ్ వీడియోపై స్పందించారు కీర్తి సురేశ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి రష్మిక ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు రష్మికపై ఇలాంటి వీడియోలు చేసి ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు.
దీనిపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించింది. డీప్ ఫేక్ వీడియో అంశం తనను భయాందోళనకు గురి చేసిందని హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపారు. :ఆ వీడియో చేసిన వ్యక్తి ఇతరులను అందులోకి లాగకుండా మరో ఉపయోగకరమైన పని చేస్తే బాగుండేది. టెక్నాలజీ మనకు వరమో, షాపమో అర్థం కావడం లేదు. ఈ ప్లాట్ ఫామ్ ను కేవలం ప్రేమ, అవగాహన, సమాచారం పంచుకోవడానికే వాడుకుందాం. అర్థం లేని చెత్తను కాదు’ అని కీర్తి సురేష్ ట్వీట్ చేశారు.