దీపావళి స్పెషల్.. అయోధ్యలో 21 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు

-

దీపావళి పండుగకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈనెల 12వ తేదీన జరగనున్న ఈ పండుగ కోసం ఇప్పటికే ప్రజలు వారి ఇళ్లను శుభ్రం చేయడం మొదలుపెట్టారు. మరోవైపు మార్కెట్లో పూలు, దీపకాంతుల విక్రయాలు మొదలవ్వడంతో.. వాటిని కొనేందుకు వస్తున్న వారితో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఆలయాలు కూడా దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న ప్రసిద్ధ రామమందిరం అయోధ్యలో దీపావళిని పురస్కరించుకుని ఘనంగా దీపోత్సవాన్ని నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి రోజున ఆలయ ప్రాంగణంలో ఏకంగా 21 లక్షల దీపాలను వెలిగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రపంచ రికార్డు కానుందని చెబుతున్నారు. 2022 దీపావళి సందర్భంగా అయోధ్యలో 15 లక్షల 76 వేల దీపాలు వెలిగించిన విషయం తెలిసిందే. అందుకు గానూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కింది. ఈసారి 21 లక్షల దీపాలను వెలిగించాలని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంకల్పించడంతో ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలోని 51 ఘాట్లలో 25 వేలమంది వాలంటీర్లు ఈ దీపోత్సవంలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news