విదేశాల్లో ఉన్న భారతీయులు మన సంప్రదాయం ప్రకారం దాదాపు అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. భారతీయులు తమ సంస్కృతి సంప్రదాయాలను, పండుగలను మరిచిపోరు. ఈ క్రమంలో త్వరలో రానున్న దీపావళి పండుగ వేడుకలను ప్రపంచంలోని పలు దేశాల్లో ముందుగానే జరుపుకుంటున్నారు.
ఇందులో భాగంగానే బ్రిటన్లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. యూకే ప్రధాని రిషి సునాక్ అక్కడి హిందువులతో కలిసి తన నివాసంలో దీపావళి పండుగ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రధాని రిషి సునాక్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో హిందువులకు ఆతిథ్యమిచ్చినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో రిషి.. తన భార్యతో కలిసి దీపాలు వెలిగిస్తూ కనిపించారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ యూకే పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
Tonight Prime Minister @RishiSunak welcomed guests from the Hindu community to Downing Street ahead of #Diwali – a celebration of the triumph of light over darkness.
Shubh Diwali to everyone across the UK and around the world celebrating from this weekend! pic.twitter.com/JqSjX8f85F
— UK Prime Minister (@10DowningStreet) November 8, 2023