బెంగళూరు లో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక న్యూజిలాండ్ లు ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓటమి ఇప్పటికే ఖరారు అయినప్పటికీ, ఇంకో పరుగులు కనుక చేసి ఉంటే ఫలితం శ్రీలంకకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉండేవి. ఎందుకంటే శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ ఇప్పటికే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ ను ఎక్కువ రన్ రేట్ తో గెలవడం చాలా అవసరం అయిన దశలోనూ ఈ విధంగా వికెట్లు కోల్పోతూ ఆడటం మంచి ప్రదర్శన అనిపించుకోదు. ఓవర్ లు తక్కువ ఆడినప్పటికీ వికెట్లు కోల్పోవడం వీరి రన్ రేట్ ను ప్రభావితంగా చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా అయిదు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.. ఇది ఒక విధంగా పాకిస్తాన్ కు శుభవార్త అంటే ఏమో చెప్పలేని పరిస్థితి.
వరల్డ్ కప్ లో చివరి సెమీఫైనల్ స్థానాన్ని గెలుచుకునే జట్టు ఏదో తెలియాలంటే పాకిస్తాన్ ఇంగ్లాండ్ ల మధ్యన జరిగే మ్యాచ్ వరకు ఆగాల్సిందే.