ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంపై ఎలాన్ మస్క్‌ కామెంట్స్

-

ఇజ్రాయెల్- హమాస్​ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. హమాస్​ను సమూలంగా అంతం చేసేందుకు కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఆ దిశగా గాజాపై విరుచుకు పడుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. హమాస్‌ సభ్యులను ఇజ్రాయెల్‌ పూర్తిగా హతమార్చడం లేదా ఖైదు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ అనే అమెరికన్‌ పాడ్‌కాస్ట్‌ షోలో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఆగాలంటే.. హమాస్ సభ్యులను చంపడమే లేదా జైళ్లలో పెట్టడమో చేయాలని.. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మస్క్ తెలిపారు. అలా చేయకపోతే ఆ ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారని (ఇజ్రాయెల్​పై దాడులు చేస్తూనే ఉంటారన్న ఉద్దేశం) అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంపై తలెత్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమని ఎలాన్ మస్క్ అన్నారు. హమాస్‌.. సైనికపరంగా ఇజ్రాయెల్‌ విజయం సాధిస్తుందని ఊహించలేకపోయిందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news