సత్తుపల్లి ఓటర్ల మద్దతు ఎటువైపు..? గులాబీ దళానికా? హస్తం వైపా?

-

తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైనా ఇక్కడ గెలుపు ఓటములు శాసించేది మాత్రం ఇతర సామాజిక వర్గం వారే. ఈ నియోజకవర్గ మహా మహులకు సొంత నియోజకవర్గం. జలగం వెంగళ రావు, తుమ్మల, పొంగులేటి వీరందరూ  ఈ నియోజక వర్గం వారే కావడంతో ఈ నియోజకవర్గంలో ఎవరి పట్టు కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారు.

సత్తుపల్లి టిడిపికి కంచుకోట. గతంలో టిడిపి నుండి సండ్ర వెంకట వీరయ్య గెలిచారు. తర్వాత ఆయన కేడర్ తో బీఆర్ఎస్ లోకి మారారు. ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య పోటీలో ఉన్నారు. సండ్ర సొంత క్యాడర్ ను అభివృద్ధి చేసుకున్నారు. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈసారి తనని గెలిపిస్తాయని సండ్ర చెబుతున్నారు. కానీ ఇక్కడ కొంతమంది టీడీపీ సానుభూతిపరులు ఉన్నారు, టీడీపీ పోటీలో లేదు కానీ వారు ఎటువైపు ఉంటారో తెలియదు.

గతంలో సండ్ర వెంకటవీరయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన మట్టా దయానంద్​ భార్య మట్టా రాగమయి ఈసారి కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు మధ్య మాత్రమే పోటీ ఉంటుంది అని రాజకీయ వర్గాల అంటున్నారు.  బీజేపీ నుంచి నంబూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అయినా పోటీ కారు, కాంగ్రెస్ మధ్యే.

కారులో సండ్ర స్ట్రాంగ్ గా ఉన్నారు. తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా గట్టిగా ఫైట్ ఇస్తుంది. తుమ్మల, పొంగులేటి కాంగ్రెస్ లోకి రావడం పెద్ద ప్లస్..మరి చూడాలి ఈసారి సత్తుపల్లి ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news