ఈనెల 17 నుంచి కేటీఆర్‌ రోడ్‌ షోలు

-

తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రచారాన్ని సాగిస్తోంది. ఇక నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకునే లక్ష్యంగా కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు.

తాజాగా కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 17వ తేదీ నుంచి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. 20వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. నాలుగు రోజుల పాటు.. రోడుకు రెండు చొప్పున ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు.  ఆయా రోజుల్లో సాయంత్రం 5కు తొలిరోడ్‌ షో, రాత్రి 7 గంటలకు మరొకటి జరుగుతుంది. అనంతరం ఈనెల 25న హైదరాబాద్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తో సహా పాల్గొననున్నారు.

కేటీఆర్ రోడ్ షో చేయనున్న నియోజకవర్గాలు ఇవే.. 

  • నవంబర్ 17 – జూబ్లీహిల్స్, ఖైరతాబాద్
  • నవంబర్ 18 – గోషా మహల్, సికింద్రాబాద్
  • నవంబర్ 19 – అంబర్ పేట, ముషీరాబాద్
  • నవంబర్ 20 – కంటోన్మెంట్, సనత్ నగర్

Read more RELATED
Recommended to you

Latest news