‘జియో ఎయిర్‌ఫైబర్’ను రిలయన్స్ జియో మరికొన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించింది. మొదట ఈ సర్వీసులను హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. మొత్తం 8 మెట్రో నగరాల్లో మాత్రమే ప్రారంభించిన సంస్థ దీపావళి పండుగను పురస్కరించుకుని మరో 115 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. జియో ఫైబర్ కోసం వెబ్ సైట్ లో ప్రత్యేకంగా ఓ పేజీని ప్రారంభించిన కంపెనీ నగరాలు, పట్టణాల జాబితాను అందులో అందుబాటులో ఉంచింది.
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్న రాష్ట్రాలు ఇవే..
తెలంగాణ: హైదరాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, వరంగల్
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
వీటతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, పశ్చిమబెంగాల్‌లో పలు నగరాలకు జియో ఎయిర్‌ఫైబర్ సేవలను విస్తరించారు.