విద్య తలరాతను మారుస్తుంది. వ్యక్తి సామాజిక హోదాను పెంచుతుంది. మిగతావారితో పోలిస్తే దళిత, గిరిజన వర్గాల విద్యార్థులు చదువులోనూ వెనకబడే ఉంటున్నారు. వారిని ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించటానికి ప్రవేశ పెట్టినవే ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిన్లు’. దీనికింద 1000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందిస్తారు.
ఎంపికైనవారికి చదివే కోర్సును బట్టి నెలకు రూ.4,500 నుంచి రూ.7,800 చెల్లిస్తారు. దీని ప్రకటన త్వరలో వెలువడనుంది. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎసీ విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న విశ్వవిద్యాల యాలు, విద్యాసంస్థలు, కాలేజీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే… https://scholarships.gov.in/ లోని UGC Schemes విభాగానికి వెళ్లి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి ఆన్ లైన్ దరఖాస్తు వివరాలను అతడు ప్రస్తుతం చదువుతోన్న విశ్వవిద్యాలయం పరిశీలించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆధార్‌ను తప్పనిసరిగా జతచేయాలి.
మానవ వనరుల అభివృద్ధి శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ సబ్సిడీలు, స్కాలర్ షిప్, ఫెలోషిప్ పొందడానికి ఆధార్ అనుసంధాన్ని తప్పనిసరిచేసింది. ఈ ఉపకార వేతనాల సమాచారం మీకు ఉపయోగపడితే మంచిదే.. లేనిపక్షంలో మీకు తెలిసినవారికి దీన్ని ఫార్వార్డ్ చేయండి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకరించండి.