ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. ఏపీ బీజేపీలో క‌ల‌క‌లం..!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఢిల్లీ వెళ్లారు., అయితే, ఆయ‌న ప‌ర్య‌ట‌న పైకి ప్రైవేటు కార్య‌క్ర‌మాని కే అని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. లోప‌ల మాత్రం ఆయ‌న ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, బీజేపీ సార‌థి అమిత్ షాను క‌లుస్తార‌నే ప్ర‌చారం కూడా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కొన్ని విధానాల‌పై ప‌వ‌న్ గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇసుక స‌మ‌స్య‌, తెలుగు మీడియం తీసేయ‌డం, కార్మికుల ఆత్మ‌హ‌త్య‌లు వంటి విష‌యాల్లో ప‌వ‌న్ త‌న గ‌ళాన్ని వినిపిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే విశాఖ లాంగ్ మార్చ్ నిర్వ‌హించారు. ఇది స‌క్సెస్ కూడా అయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ దూకుడు పెంచారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌జావ్య‌తిరేక ప్ర‌బుత్వ విధానాల‌పై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసేందుకు తాను వెనుకాడ‌బోన‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్పుడు ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అయి రాష్ట్ర ప‌రిస్థితుల‌పై ఫిర్యాదు చేస్తారా? చేస్తే.. కేంద్రంలోని పెద్ద‌ల రియాక్ష‌న్ ఏంటి? అనే కోణంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పై కూడా కేంద్రంలోని పెద్ద‌లు ఫైర్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ ఇప్ప‌టికే రాష్ట్రంలో పాద‌యాత్ర‌లు, నిత్యం మీడియా మీటింగులు పెట్టి జ‌గ‌న్‌ను తిట్టిపోస్తున్నారు. ఈక్ర‌మంలో వారికి క‌నిపించ‌ని ఈ స‌మ‌స్య‌ల‌పై ఇప్పుడు ప‌వ‌న్ వెళ్లి నేరు గా కేంద్రంలో ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర నాయ‌క‌త్వం ఏచేస్తోందంటూ .. ప్ర‌శ్న‌లు కురిపించ‌రా? అనేది కీల‌కం గా మారింది. ఈ విష‌యంపైనే బీజేపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న అవుతున్నారు.

ఇప్పుడు ప‌వ‌న్ వెళ్లి జ‌గ‌న్‌పై ఫిర్యాదులు చేస్తే.. తాము సైలెంట్‌గా ఉన్నామ‌నే భావ‌న కేంద్రంలో క‌లుగుతుంద‌ని, వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వానికైనా క‌నీసం ఆరుమాసాల గ‌డువు ఇవ్వాల‌నే బీజేపీ సిద్ధాంతం మేర‌కు తాము సైలెంట్‌గా ఉన్నామ‌ని, కానీ ఇప్పుడు ఇలా ప‌వ‌న్ యాగీ చేస్తే.. త‌మ ప‌రిస్తితి ఏంట‌ని బీజేపీ రాష్ట్ర నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news