RECORD: పాంటింగ్ కు షాకిచ్చిన కింగ్ “కోహ్లీ”@నెం.3 !

-

ఈ తరం క్రికెటర్ లలో ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ చాలా గొప్ప ఆటగాడని చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని చరిత్రలో నిలిచిపోయాడు. ఇక తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లోనూ చెలరేగి ఆడుతూ ఇండియాకు మరిన్ని విజయాలను అందించాడు. ఈ రోజు ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి సెమి ఫైనల్ లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్ డే లలో అధిక పరుగులు సాధించిన వారి జాబితాలో మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ (18426), రెండవ స్థానంలో (14234) లు ఉన్నారు, ఇక ఈ మ్యాచ్ కు ముందు వరకు మూడవ స్థానంలో పాంటింగ్ (13704) ఉన్నాడు. కానీ ఈ రోజు కోహ్లీ రాణిస్తుండడం వలన పాంటింగ్ ను దాటేశాడు.

ప్రస్తుతం కోహ్లీ వన్ డే లలో 13762 పరుగులు చేసి పాంటింగ్ ను అధిగమించి రికార్డు సాధించాడు. ఇదే విధంగా ఆడితే కోహ్లీ ఈ సంవత్సరంలోనే సంగక్కర రికార్డును సైతం అధిగమించగలడు.

Read more RELATED
Recommended to you

Latest news