వరల్డ్ కప్ లో కింగ్ కోహ్లీ పరుగుల వర్షం…రికార్డులు దాసోహం!

-

ముంబై లోని వాంఖడే స్టేడియం లో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా పరుగుల వర్షం కురిపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా అదరగొడుతోంది. ముందుగా రోహిత్ (49) చాలా అటాకింగ్ గేమ్ తో ఆకట్టుకోగా, ఆ తర్వాత గిల్ మంచి స్ట్రోక్ ప్లే తో రాణించాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ సమయం తీసుకున్నా ఆ తర్వాత చెలరేగి ఆడి కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లోనే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 711 పరుగులు చేశాడు.

కానీ కోహ్లీ తర్వాత 2003 వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ (673), 2007 లో హేడెన్ (659), 2019 లో రోహిత్ శర్మ (648) పరుగులు చేశారు. వీరందరినీ దాటేసిన కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఇలాంటి ఎన్నో రికార్డులు కోహ్లీ అందుకుని ఎవ్వరినీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news