టీమిండియాకు షాక్… ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు కీలక ప్లేయర్ దూరం కానున్నారు. వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడ్డ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరికొన్ని నెలల పాటు జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో….అతను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్ కు అందుబాటులో ఉండడని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.కాగా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ కు చేరుకుంది. అందరూ ఊహించినట్టుగానే… సెమీ ఫైనల్ పోరులో బొక్క బోర్లా పడింది సౌత్ ఆఫ్రికా జట్టు. నిన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో… ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు పోరాడి గెలిచింది.