Malla Reddy : చంద్రబాబు అరెస్టైతే ఏడ్చాను : మల్లారెడ్డి

చంద్రబాబు తనకు రాజకీయ బిక్ష పెట్టారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన అరెస్ట్ అయితే ఏడ్చానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలు నడుపుకునే నన్ను చంద్రబాబు ఎంపీ చేశారు. ఆయన అరెస్ట్ అయితే నాకు బాధ అయింది. ఏడ్చాను. సెటిలర్ల ఓట్ల కోసం నేను యాక్టింగ్ చేస్తున్నానంటే బాధేస్తోంది. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు. కావాలని జైల్లో పెట్టారు. ఆంధ్ర రాజకీయం అలా ఉంది’ అని మల్లారెడ్డి చెప్పారు.

malla reddy comments on chandrababu arrest
malla reddy comments on chandrababu arrest

రేవంత్‌ రెడ్డి ఇంత గొప్పోడు ఎలా అయ్యాడు. నన్ను రేవంత్‌ రెడ్డి ఎంతో ఇబ్బంది పెట్టాడని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ సీటు వదులుకో, లేకపోతే నీ కాలేజీలు బంద్‌ చేయిస్తా అని బెదిరించాడని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులుండొచ్చు.. వాటిని సరి చేసుకుంటానని చెప్పారు. చంద్రబాబును నా టాలెంట్‌తో ఇంప్రెస్‌ చేశానని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసి మూడు టికెట్లు కావాలని అడిగా. నాలాంటి వాళ్లు కావాలని చంద్రబాబు రాజకీయాల్లో తీసుకున్నారన్నారు మల్లారెడ్డి.