పది ఫెయిల్ అయ్యాడు… 35 రిమోట్ విమానాలను తయారు చేసాడు…!

-

విద్యలో మార్కులు వస్తేనే ప్రతిభకు కొలమానమా…? కాదనే విషయం ఇప్పటికి పలు మార్లు నిరూపించారు కూడా కొందరు. చదువు రాకపోయినా సరే ప్రతిభ ఉంటే ఏ స్థాయికి అయినా వెళ్ళవచ్చు అని తమ ప్రతిభతో నిరూపించారు. తాజాగా గుజరాత్ కి చెందిన ఒక బాలుడు తన ప్రతిభతో ప్రపంచాన్నే షాక్ కి గురి చేసాడు. జాతీయ మీడియా కథనం ఆధారంగా… గుజరాత్ లోని వడోదరకు చెందిన 10 వ తరగతి బోర్డు పరీక్షలలో మొత్తం 6 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ, తల్లి తండ్రులు ఏదైనా చెప్తే చేస్తూ టైం పాస్ చేసేవాడు…

ఇక ఏ పనీ లేనప్పుడు ఇంటర్నెట్ లో విమానాల తయారీ గురించి తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి 17 ఏళ్ళ పాంచల్ రిమోట్ కంట్రోల్ సహాయంతో 35 మోడల్ విమానాలను తయారు చేసాడు. హోర్డింగ్‌లు మరియు బ్యానర్‌లలో ఉపయోగించే ఫ్లెక్స్ మెటీరియల్‌ను ఉపయోగించి ముందు తేలికపాటి విమానం మోడల్‌ను తయారు చేశాడు. ఇక అక్కడి నుంచి రిమోట్ సాయంతో నడిచే విమానాలను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఒక యుట్యూబ్ ఛానల్ ని కూడా ఓపెన్ చేసిన ప్రిన్స్… దీనికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు.

అయితే అతను ఈ విమానాలు తయారు చేసినా అతను మాత్రం పది పాస్ అవ్వలేదంటూ ఇంటి చుట్టు పక్కల వాళ్ళు అతన్ని ఎద్దేవా చేయడం విశేషం. ఇక పది ఎందుకు పాస్ అవ్వలేదని మీడియా ప్రశ్నించగా… తాను చదువుకోవడానికి కూర్చున్నప్పుడు తన తల భారంగా అనిపిస్తుందని… నా కాలనీలోని ప్రజలు నన్ను ‘తారే జమీన్ పర్’ వాలా లడ్కా అని పిలుస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రతిభ ఉంటె దానిని సరైన మార్గంలో పెట్టగలిగితే పిల్లలు ప్రయోజకులు అవ్వడానికి పెద్ద సమయం పట్టదు అంటున్నారు పలువురు… ప్రస్తుతం ఇతని విమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news