డిపాజిట్లు రాని పార్టీ.. బీసీనీ సీఎం చేస్తుందా ? : రేవంత్ రెడ్డి

-

గత ఎన్నికల్లో బిజెపికి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంత్ అవుతాయని తెలిపారు. అలాంటి పార్టీ బీసీని ఎలా సీఎం చేస్తుందని ప్రశ్నించారు. బీసీ గణన చేయలేని పార్టీ బీసీని సీఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి మాటలను ప్రజలు అస్సలు నమ్మరని అబద్దపు హామీలను మందకృష్ణ మాది కూడా నమ్మకూడదు అన్నారు. ఇదే నా విజ్ఞప్తి అని మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రజలు చరమగీతం పాడతారని.. కెసిఆర్ బాయ్ చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. తెలంగాణలో బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అన్నారు. బిజెపికి ఓటేసినా టిఆర్ఎస్ కేసినట్టే బి ఆర్ ఎస్ కు ఓటేసినా బీజేపీకే ఓటేసినట్టాని తెలిపారు పిసిసి చీప్ రేవంత్ రెడ్డి. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి టిఆర్ఎస్ నేతలకు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news