కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం రాష్ట్రంలో గద్వాల, నల్గొండ, వరంగల్ సభలో పాల్గొన్నారు అమిత్ షా. సభల్లో పాల్గొన్న తర్వాత బిజెపి మేనిఫెస్టోని ప్రకటించారు. ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్లో పాల్గొనేందుకు ఇవాళ అహ్మదాబాద్ కు వెళ్లారు. రేపు మరొకసారి తెలంగాణలో పర్యటించనున్నారు అమిత్ షా. సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి బయలుదేరి ఒకటి గంటలకు జనగామ పబ్లిక్ మీటింగ్ కి హాజరవుతారు.
ఆ తర్వాత అక్కడ సభ అనంతరం 2.45 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని కోరుట్ల కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 3:40 వరకు సభలో పాల్గొంటారు. అనంతరం కోరుట్ల నుంచి బయలుదేరి 4:45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్ చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిసిన తర్వాత ఎనిమిది పది గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారు అమిత్ షా.