World Cup Final : రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. టార్గెట్ ఛేదించేనా..?

-

వన్డే ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ లో టీమిండియా నామమాత్రపు స్కోర్ కే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే సాధించి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(54), కే.ఎల్.రాహుల్ (66) రోహిత్ శర్మ 47 కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో గిల్, అయ్యర్, జడేజా నిరాశ పరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లను పడగొట్టాడు. వీరితో పాటు మాక్స్ వెల్, జంపా చెరో వికెట్ సాధించారు.

బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా మొదటి ఓవర్ లో 11 పరుగులు సాధించి విజయం సాధించే దిశగా దూసుకెళ్లింది. దీంతో మహ్మద్ షమీ తన బంతితో డేవిడ్ వార్నర్ పెవీలియన్ కి చేర్చాడు. షమీ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇక బుమ్రా బౌలింగ్ లో మార్ష్ కే.ఎల్. రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ ఓవర్ బుమ్రా మెయిడిన్ ఓవర్ వేశాడు. మరియు వికెట్ కూడా తీశాడు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ కీలకపోరులో ఆస్ట్రేలియా టార్గెట్ ను ఛేదిస్తుందా..? లేక భారత్ ఆలౌట్ చేస్తుందానని వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news