పదేళ్ల కాలంలో కేసీఆర్ కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు : భట్టి

-

మధిరలోని జానకీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నవంబర్ 30న ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ ఉండదని అన్నారు. నేను ఇక్కడే ఉంటాను… నాకు ఓటు వేయండని బీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారని, కానీ పోలింగ్ తర్వాత ఆ పార్టీయే ఉండదు… ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కడ ఉంటారు? అని మల్లు భట్టి చురకలు అంటించారు.

TDP cadre to campaign for Bhatti Vikramarka in Madhira constituency - The  Hindu

ఈ పదేళ్ల కాలంలో కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు భట్టి విక్రమార్క. ఆరోగ్యశ్రీ ఇచ్చింది.. రోడ్లు వేసింది.. కరెంట్ ఇచ్చింది.. అన్నీ కాంగ్రెస్సే చేసిందన్నారు. అందుకే అభివృద్ధి చేసే కాంగ్రెస్‌ను గెలిపించారని, అభివృద్ధిని పక్కన పెట్టిన బీఆర్ఎస్ మనకు వద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంపదను పేదలకు పంచుతామన్నారు భట్టి విక్రమార్క. కేసీఆర్ గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news