భారత్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. ‘వరుసగా మ్యాచ్లు గెలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అదే మీ పతనానికి దారితీస్తుంది’ అంటూ భారత్ ను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే అందుకు కారణం ఓవర్ కాన్ఫిడెన్సే అంటూ టీమిండియాపై విమర్శలు గుప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ అభిమాని మృతి చెందాడు. తిరుపతి మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ టీమిండియా ఓటమి అనంతరం, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ చలించిపోయారు. ఆకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించగా…. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.