గెలాక్సీ లీడర్ నౌక హైజాక్ వీడియో రిలీజ్ చేసిన హౌతీ రెబల్స్

-

తుర్కియే నుంచి భారత్​ వస్తున్న ఇజ్రాయెల్ సరకు రవాణా నౌక గెలాక్సీ లీడర్​ను హౌతీ రెబల్స్ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. గాజాపై దాడులకు తెగబడుతూ పాలస్తీనా ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్న ఇజ్రాయెల్​కు నిరసనగా హైజాక్ చేసినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించారు. అయితే తాజాగా నౌక ఎలా హైజాక్ చేశారో చూపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. ఎర్ర సముద్రంపై వెళ్తున్న కార్గో షిప్​ను ఓ హెలికాప్టర్​తో వెంబడించిన రెబల్స్.. ఆ నౌకను తమ అధీనంలోకి తీసుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మొదటగా రెబల్స్ హెలికాప్టర్​లో ఎర్ర సముద్రంలో ఉన్న నౌక వద్దకు చేరుకుని.. షిప్​పైన ఎవరూ లేని సమయంలో షిప్ డెక్​పై హెలికాప్టర్​ను ల్యాండ్ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ.. కాల్పులు జరుపుతూ హౌతీ రెబల్స్ హెలికాప్టర్​లో నుంచి దిగి.. వీల్ హౌస్, కంట్రోల్ సెంటర్​ను తమ అధీనంలోకి తీసుకుని నౌకను యెమెన్​లోని సలీఫ్ పోర్టుకు తరలించారు. అనంతరం ఈ నౌకపై దాడి కేవలం ఆరంభం మాత్రమేనని.. గాజాపై దాడులు ఆపకపోతే ఇంకా చాలా దారుణాలు చూడాల్సి వస్తుందని హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్​ను హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news