విజృంభిస్తున్న ప్లూ వైరస్.. తమిళనాడు ప్రభుత్వం కీలక ఆదేశాలు

-

కొవిడ్‌ మహమ్మారి విధ్వంశంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో.. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్.. ‘హెచ్‌3ఎన్‌2 (H3N2)’ కారణంగా ఇటీవలే కొంత మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా హరియాణా, కర్ణాటక రాష్ట్రాలో ఈ వైరస్‌ బారిన పడి బలయ్యారు.

ఈ వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఆకస్మిక వాతావారణ మార్పుల కారణంగా ఈ వైరస్‌ విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఇన్‌ఫ్లుయెంజా ఏ H3N2 పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించింది. మరోవైపు తమిళనాడులో ఈ వైరస్ విజృంభిస్తోంది ప్లూ వైరస్. ప్రభుత్వం జిల్లాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ సంఖ్యలో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు బాధితులు. మాస్క్ లేకుండా బయటకు రావద్దని కోయంబత్తూరు జిల్లా ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు అదికారులు. కేసులు పెరుగుతున్న పలు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

Read more RELATED
Recommended to you

Latest news